Menu
in

సొరకాయ

సొరకాయ శాఖాహారులకు ఇష్టము. మాంసాహారులకు పరమ చిరాకు. పాలు పోసి వండితే చాలా బాగుంటుంది. టమొటోతో  పచ్చడి చేస్తే రుచిగా ఉంటుంది.

మామిడి ముక్కలతో కలిపి పచ్చడి చేస్తే అదుర్స్. 

సొరకాయ చెనగ పప్పు కర్రీ.

నేతి సొరకాయ పులుసు.

సొరకాయ కారం.

బీరకాయలు సమయానికి లేక , చెనగపప్పు తో సొరకాయ చేశాము. సొరకాయ, మామిడి ముక్కలతో పచ్చడి చాలా రుచిగా ఉంటుంది .

పిల్లల కు హాస్టల్ కి తీసుకు వెళ్ళడానికి, నిల్వ ఉండటానికి సొరకాయ కారం చేశాము.

ఈ రోజుల్లో సొరకాయలు ఖరీదు. సీజన్ లో తక్కువకు వచ్చి నప్పుడు కొని కారం చేసుకుంటే, నిల్వ ఉంటుంది. 

సొరకాయలు తినని వారు, ఆరోగ్యం కోసం ఏదో ఒక రకంగా, రుచి గా చేసుకుని తినండి. పప్పు చారు, సాంబారు, దప్పళంల్లో సొరకాయ ముక్కలు లేకుండా చేయరు. ఆరోగ్యానికి మేలు చేసే సొరకాయను పిల్లలకు తినిపించండి .

ఫ్రీ డైజెషన్, ఫ్రీ మోషన్ కలుగుతాయి.  షుగర్ కు, కిడ్నీలకు, బీ.పీ, మొదలైన రోగాలకు మంచిది.

Leave a Reply

Exit mobile version