చిన్నప్పుడు నేను స్కూలు బైట ఐదు పైసలు పెట్టి తాండ్ర, జీడిలు తిన్నాను. దాంతో ప్రతి నెలా జ్వరాలు వచ్చేవి. అయినా బుద్ది రాలేదు. కానీ కామెర్లు వచ్చాయి.
తర్వాత ఆరు నెలలు పత్యం. ఉప్పు లేని కూడు. చివరకు బుద్ధి వచ్చిందని వేరే చెప్పక్కర్లేదు కదా. ఇక పైసలు బంద్, కొనుక్కోవడం బంద్. ఈ కాలం పిల్లలకు ఐదు పైసలు తెలీక పోవచ్చు.
ఐదు పైసలకు -ఐదు కొబ్బరి ఉండలు లేదా పల్లీ ఉండలు లేదా పెద్ద జామకాయ – ఇలా వచ్చేవి. నెమ్మదిగా పైసలు మాయమయ్యాయి, రూపాయల విలువ పోయింది.
పిల్లలు పుట్టాక అంతా ఇంటి భోజనం. ఒకవేళ బయటనుండి తెచ్చినా మైదా , డాల్డా – లేకుండా తెస్తాము. చివరకు పచ్చి మిర్చి బజ్జీలు కూడా రుచిగా ఇంట్లో చేస్తాము .
చింతతొక్కుతో మిర్చీ బజ్జీ లు తయారీ .
చిన్నప్పుడు ముంతకింద పప్పు బండ్లు ఉండేవి . నేడు చాట్ భండార్లు వీధి వీధి కి ఉన్నా యి . మా అన్న బయటకు వేళితే పానీ పూరీలు కొని , పిల్లలకు పెట్టాలని తహతహలాడతాడు . కానీ రాక్షసిలా నేను విరుచుకు పడతాను. దాంతో తిట్టిపోస్తాడు . కానీ పిల్లలకు రుచి చూపాలని చాలా ప్రయత్నాలు చేశాడు .
చివరకు పచ్చి పానీపూరీలు తెచ్చి , మా అమ్మ తో వేయించాడు . నన్ను నూనె మూకుడు పెట్టమంటే గయ్ మంటాను . చెనగలు నానేసి , వేయించి , ఆలు కలిపి , చాట్ చేశాడు. మా అన్న ఆలు కర్రీ సూపర్ చేస్తాడు .
ఉల్లిపాయ ముక్కలు , టమాట , నిమ్మరసం -రెడీ చేశాడు. పానీపూరీలోకి వాటర్ పౌడర్, రెడీ మేడ్ తెచ్చి, నీరు కలిపి పెట్టాడు.
పానీపూరీలో చెనా మసాలా వేసి, ఉల్లి, టమాట ముక్కలు వేసి, నిమ్మరసం వేసి, పుదీనా వాటర్ వేసి, రకరకాల కూరలు వేసి , పిల్లలకు తినిపించాడు. పనిలో పనిగా పెద్దలు రుచి చూశారు.
పిల్లలు పెద్దైనారు. వారు ఇంట్లో పానీపూరీలు చేయ మని గొడవ . అన్నం తినకుండా, నూనే తింటే నాకు కోపం . దాంతో మధ్యే మార్గంగా అన్నం పూరీలో కూరి, పిల్లలకు తినిపించాను . దాంతో నాకు , పిల్లలకు సాటిస్ ఫ్యాక్షన్ వచ్చింది.
అసలు కధ ఇప్పుడు మొదలై నది . షాపింగ్ కి వెళితే , కొంత మంది పిల్లలు చాట్ భండార్లు దగ్గర కొనుక్కుని తింటున్నారు . వారిని చూసి ముచ్చటపడి మా అక్క పిల్లలకు డబ్బు లిచ్చి , క్యాంటీన్లో కొనుక్కో మంది . మేము కొనుక్కోము అని చెప్పారు .
దాంతో ఒకరోజు మా అక్క పిల్లల్ని ఇంటి దగ్గర చాట్ భండార్ దగ్గరకు తీసుకొని వెళ్ళి , పానీపూరీలు పెట్టించింది . అప్పుడు మా పిల్ల – ఛీ ! చెత్త గా ఉంది . మామ పెట్టింది సూపర్ . మా అమ్మ బాగా చేస్తుంది . ఇది చెత్త . ఇంకోసారి ఇలా తీసుకురాకు – అని వార్నింగ్ ఇచ్చింది .
ఆ చాట్ భండార్ చాలా ఫేమస్ . ఎక్కడెక్కడో నుండో వచ్చి తింటారు . లక్షలు సంపాదిస్తున్నారు . అట్లాంటి దాన్ని , ఒక్క మాటతో తీసి పడేసింది . ఇప్పుడు మా అక్క కు బుధ్ధి వచ్చింది . ఇంకోసారి బయట కు తీసుకు వెళ్ళను , పరువు తీసేస్తుంది – అన్నది .
చిన్నప్పటి నుంచి పిల్లలకు ఇంటి భోజనం అలవాటు చేస్తే , బయట తిళ్ళకు అలవాటు పడరు . ఆరోగ్యం బాగుంటుంది . అంతకన్నా తల్లిదండ్రుల కు కావలసినది ఏమున్నది .