Menu
in ,

వామనగుంటలు

వామన గుంటలు అనేది ప్రాచీన కాలం నాటి ఆట. ఈ ఆట ఆడటం మొదలైతే గుంటలు గడుస్తాయి. ఈ ఆట ఆడితే వానలు పడతాయి. అందుకనే దీన్ని వేసవిలో సెలవులకు తాతగారింటికి వెళ్ళి నప్పుడు ఆడేవారు.

మా నాయనమ్మ ఇందులో రెండు ఆటలు నేర్పింది. ఆఫ్రికా, అమెరికా లో కూడా ఈ ఆటలు ఆడతారు. తమిళులు ఈ ఆట ఆడతారు. ఈ ఆటకు చెక్కతో చేసిన బోర్డు ఉంటుంది. ంం

బోర్డు కి 7గుంటలు ఉంటాయి. ఇద్దరు ఆడవచ్చు. రెండు రకాల ఆటలు ఆడతారు. బోర్డు లేని వారు నేలమీద సున్నాలు గీసి ఆడవచ్చు.

ఆడే విధానం-దేభ్యం ఆట–

ఆరు గింజలు చొప్పున, గుంట లలో వేసుకోవాలి. చింతగింజలు, పిస్తా తొక్కలు, కుంకుడు గింజ లు,కంకర రాళ్ళు-ఏవైనా తీసుకోవచ్చు.

ఆట ఎదురూ-బొదురు ఆడాలి. (కొంత మంది ఒకేవైపు ఆడుతారు).

ఒక గుంట లో ని గింజల ను కుప్ప అంటారు. ఎక్కడి కుప్ప నైనా తీసుకుని, పంచాలి. కాయిన్స్ అయిపోయాక, తర్వాత కుప్ప తీసి, పంచాలి. ఆఖరి కాయిన్ వేశాక, తర్వాత గుంట ఖాళీ ఉంటే, దాన్ని వేళ్ళతో టచ్ చేసి(నాకుడు అంటారు), దాని పక్కన కుప్ప తీసుకోవాలి.

ఖాళీ గుంట లో 4కాయిన్స్ చేరగానే, ఆవు అంటారు. దాన్ని ఏ పక్కవస్తే, ఆపక్క వాళ్ళు తీసుకోవాలి. చూసుకోకపోతే , 5కాయిన్స్ అయితే, ఆవు మురిగి పోతుంది. దాన్ని కుప్పగా ఉంచాలి.

ఆట చివరి ఒక కాయిన్ మిగిలితే, అదీ చివరి ఉన్నపుడు, ఆటూ-ఇటూ వేస్తూ, ఆట సాగనప్పుడు, ఆట వకరు తీసుకుని, కాయిన్ ఇంకొకరు తీసుకో వాలి.

ఆట చివర ఎవరు ఆడతారో, సెకండ్ రౌండ్ లో వారే మొదట ఆడాలి. వచ్చిన కాయిన్స్ పేర్చుకోవాలి. తక్కువ గుంట లు నిండి తే, అంతవరకే ఇరువైపులా పేర్చి ఆడాలి.

1,2,3,5 కాయిన్స్ ఒక గుంట లో నింపితే, దాన్ని దేభ్యం అంటారు. ఎదుటి వారు, కాయిన్స్ పంచి, దేభ్యం ముందు వరకు వేసి, దేభ్యం నెత్తిమీద కొట్టి, పక్కన కాయిన్స్ తీసుకోవచ్చు.

4దేబ్యం వస్తే, నెత్తిమీద కొట్టకూడదు, ఆట ఆఖరున ఇద్దరూ సమానంగా పెంచుకోవాలి.

ఆవు ఆట—-

ఇందులో కాయిన్స్ తక్కువ వేస్తే కుప్ప పెట్టారు.

ఆవుని తీసుకోకూడదు. దాన్ని ఆట చివర తీయాలి. ఆవు అనే గుర్తు కోసం పైన ఒక కాయిన్ పెడతారు.

ఆవు ఆటలో దేభ్యం ఉండదు. ఈ ఆటలో ఓడిపోవచ్చు.

కాని దేభ్యం ఆటలో ఓటమి ఉండదు.

పై లింక్ లో ఆటను వివరంగా చెప్పాను.

Leave a Reply

Exit mobile version