in ,

రోబో

రోబో సినిమా వచ్చిన తర్వాత మా జీవితం లో చాలా మార్పులు వచ్చాయి.

ఆ సినిమా చూసి, అలాంటి కళ్ళజోడు కావాలి, హెల్మెట్ కావాలి, అలాంటి మిషన్ కావాలి,-ఇలా పిల్లలు తల్లి దండ్రుల ను ఒక ఆట ఆడించారు.

మా గడుగ్గాయలు ఇంకా కధలు కావాలి అని గొడవ పెడితే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ మీద కధ చెప్పాను. కృత్రిమ మేధ పేరున, కహానియా.కామ్ లో ప్రచురించాను.

కానీ అసలు కధ ఇప్పుడు మొదలైంది. ఏ చిన్న పని చెప్పినా,చేయము అంటున్నారు, పిల్లలు. మొక్కైవంగనిది ,మానై వంగదు. ఇప్పుడు నేర్చు కోకపోతే, ఇంకెప్పుడు నేర్చు కుంటారు? అని అడిగితే,

సమాధానం గా వారు చెప్పింది విని తల బాదుకున్నా. మాకేం ఖర్మ, మేము రోబో లను కొనుక్కుని, పని చేయిచుకుంటాం-అన్నారు.

చివరకు పనమ్మాయి కూడా పిల్లలను ఎకసెక్కం చేయసాగింది. ఊరుకోండి అమ్మగారు, పిల్లలు రోబోలను కొనుక్కుని, పని చేయించుకుంటారు-అని.

దాంతో ఉడికిపోయిన పిల్లలు, అసలు మేమే తయారు చేస్తామన్నారు. వంట రోబో, వర్కర్ రోబో, క్లీనింగ్ రోబో.

సర్వర్ రోబో, టీచర్ రోబో-ఇప్పటికే తయారయినాయి. వంట రోబో మీద ప్రయోగాలు చేస్తున్నారు.

బట్టలుతికి, ఆరబెట్టి, ఇస్త్రీ చేసి,ఆల్మరాలో సర్దే ఒక వాషింగ్ మిషన్ కోసం ప్రయోగాలు జరుగుతున్నాయి అని లోగడ చదివాను. బీరువా సైజులో ఉండి, పైన అల్మరా,కింద ఐరన్, దాని కింద డ్రై యర్, ఆఖరున వాషింగ్ మిషన్. అప్పటి నుండి వెయిటింగ్, ఎప్పుడు అలాంటి మిషన్ వస్తుందా అని.

బాల వాక్కు,బ్రహ్మ వాక్కు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డెవలప్ మెంట్ తో , రకరకాల మెషిన్స్ వస్తున్నాయి. అమ్మమల కాలం లో రోళ్ళు, రోకళ్ళు, అమ్మల కాలానికి మిక్సీ లు, గ్రైండర్ లు వచ్చాయి.

ఇప్పుడు వాషింగ్ మెషిన్, డిష్ వాషర్ లు వచ్చాయి. భవిష్యత్తులో అన్ని పనులకూ రోబోలు వస్తాయి.

పనులు ఎలాగూ చేయడం లేదు, మార్కులు అయినా బాగా రాకపోతే, రేపు మంచి ఉద్యోగాలు ఎలా వస్తాయి.డబ్బులెలా వస్తాయి?-అని చిన్న గా మందలించా పిల్లలను.

అసలు నీకు డబ్బు తో ఏం పని, మార్కులే ముఖ్యమా? నాలెడ్జ్ అవసరం లేదా? గయ్ మన్నారు, పిల్లలు.

నాకెందుకమ్మా డబ్బు?వళ్ళు వంచి ,ఇంత వండుకుని, తినగలను. పాపం మీరు రోబోలు కొనుక్కుని, వండించుకోవాలి,మీకా వండుకోవడం రాదు కదా. రోబోలు  అమ్మ లా ఫ్రీ గా రావు . లక్షల్లో ఉంటాయి. నేను చదువు మాత్రం చెప్పి స్తాను.

మీరు ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించి, రోబో లను కొనుక్కోవాలి-నాలుగు అంటించాను.

ఇప్పుడు ఏదో పనమ్మాయి దొరుకుతుంది.భవిష్యత్తులో ఈమాత్రం పనిచేసే వాళ్ళు ఉండరు,నాకు ఒక రోబోని కొని పెట్టాలి-ఆర్డర్ చేశా.

రోషం వచ్చి, మేము ఇంజనీరింగ్ చదివి, రోబో లను సృష్టిస్తాము- అన్నారు

ఆవు చేలో మేస్తే,దూడ గట్టు న మేస్తుందా? తల్లి వి నీవు ఊహల్లో కధలు చెప్పావు, మరి పిల్లలు వాటిల్లో జీవిస్తున్నారు. వాళ్ళ తప్పేంటి?అని,మా పెద్దలు నన్నే మందలించారు.

ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు-అంటే ఇదేనేమో. నేను చెప్పిన కధ లే , నన్ను ముంచుతున్నాయి. ఏమో భవిష్యత్తులో రోబో లదే హవా-ఇది మాత్రం అక్షర సత్యం.

Report

What do you think?

13 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

వామనగుంటలు

చీపురు చేసిన పెళ్లి