యోగవాసిష్ఠం రామాయణాతర్గతం . రాముని పట్టాభిషేకం కు ముందు అతని లో కలిగిన విరక్తి కి సమాధానమే ఈ యోగ వాసిష్ఠం.
దీన్నే వసిష్ఠ గీత అంటారు.ఈ గీతను వినడం వలన రాముడు తనను వనవాసం వెళ్ళమన్నా మరో ఆలోచన లేకుండా తండ్రి ఆనతి పాటించాడు.
అయితే మొత్తం వేదాంతం కాకుండా అద్భుతమైన కధలు వర్ణించారు.ఆ కధల ద్వారా వేదాంతం వివరించారు.ఈ పుస్తకం ఒక కౌన్సిలర్.పరీక్ష లలో ఫెయిల్ అయితేను ; తమ్ముడికి గొలుసు , నాకు చిన్న ఉంగరం కొన్నారని ; ఫోన్ ఇవ్వలేదని , టీ వీ లో సీరియల్ చూడనివ్వలేదని – ఇలా చిన్న , చిన్న సమస్యలకు ఆత్మహత్య చేసుకునే వారు రోజు రోజుకు పెరుగుతున్నారు .
ఈ యోగ వాసిష్ఠం ను , భగవద్గీత ను రోజూ చదివి తే మానసిక దౌర్బల్యం , క్షణికావేశం నిర్మూలించి , నిర్మాణాత్మక మైన ప్రగతి సాధించవచ్చు.
పై లింక్ లలో యోగవాసిష్ఠంలోని అద్భుతమైన కధలు చదివి వినిపించాను . మల్లీశ్వరి (బ్లాక్ & వైట్ – ఎన్టీఆర్ , భానుమతి నటించినది) సినిమాలోని కధ కూడా యోగవాసిష్ఠంలో ఉన్నది . .