Menu
in ,

ఫస్ట్ శాలరీ

జీవితంలో మొదటిసారి ఏమి దొరికినా, చాలా ఆనందంగా ఉంటుంది.అందులోనూ డబ్బు మొదటిసారి , కష్టార్జితం అయితే చాలా ఆనందంగా ఉంటుంది.

మా చిన్నప్పుడు ఎవరికైనా మొదటి కష్టార్జితం రాగానే, దేవుని దగ్గర పెట్టి, అగరవత్తి తిప్పి, ఒక రూ. 116 లు భగవంతుని కి , ఆలయం లో పూజకు,సేవకు, హుండీకి సమర్పించిన తర్వాత లేకపోతే ఆ ఉద్దేశం తో పక్కకు తీసి, మిగిలిన ధనంతో తల్లి, తండ్రి, తోబుట్టువులకు కొంత ఖర్చు కోసం తీస్తారు. తర్వాత మిఠాయి కొని చుట్టు పక్కల వారికి, ఆఫీస్ లో ను సంతోషంగా పెంచుతారు.

కానీ ఈ కాలం పిల్లలకు ఇవి ఏవీ పట్టవు. చేతికి ధనం రాదు. అకౌంట్ లో పడతాయి. చక్కగా షాపింగ్ చేస్తారు. మా కూతురు వరుస పిల్ల అమెరికాలో చదువులో భాగంగా, వర్క్ అవర్స్ లో పార్ట్ టైం జాబ్ చేస్తున్నది. వారానికి మూడు రోజులు, రోజుకి రెండు గంటలు.గంటకు 10 డాలర్లు.

రెండు వారాల తర్వాత ట్యాక్స్ కట్ చేసి , మిగిలిన ది అకౌంట్ లో వేశారు. ఇక బంగారు తల్లి జీతం మొత్తం తీసుకుని వెళ్ళి,హై హీల్స్ కొనుగోలు చేసింది.నాలుగైదు జతలు.

చెప్పులు దానం చేస్తే శని దేవుని కి శాంతి అంటారు. అలాంటిది చెప్పులు కొనడం ఏమిటి ఖర్మ? ముందు కనీసం 11డాలర్లు దేవుని కొరకు తీయలేదు. కన్న తల్లి దండ్రుల కు ఖర్చు పెట్టలేదు. కనీసం ఫుడ్ అయినా తేలేదు.

విషయం తెలుసుకున్న నేను ,పిల్లకు మన పద్దతులు ఇవి, వీటిని ఫాలో చేయ్యాలి ,అని వివరించాను. దాంతో తండ్రి కి చెప్పులు తెచ్చింది. చెల్లికి, ఫ్రెండ్స్ కీ బర్గర్లు కొని పెట్టింది. వాళ్ళమ్మ పోరగా 11డాలర్లు  ఆలయం కోసం ఇచ్చింది.

ఈ కాలం పిల్లలకు జీతానికన్నా, క్రెడిట్ కార్డు ల బిల్లు ఎక్కువ. ముందుగానే అప్పు చేసి పప్పు కూడు తింటారు. తర్వాత వచ్చే జీతం వడ్డీలకు కడతారు.

అసలు ఆర్ధిక ప్రణాళిక ప్రతి ఒక్కరూ తయారు చేసుకోవాలి. ముందు కొంత పొదుపు చేయాలి. పీపీ ఎఫ్ లో కొంత మదుపు చేయాలి. జీవిత భీమా, ఆరోగ్యం భీమా తీసుకోవాలి.

మూడు నుండి ఆరు నెలల ఖర్చుకు సరిపడా ధనము బ్యాంకు లో అందుబాటులో ఉంచుకోవాలి. అనుకోని పరిస్థితులు ఏర్పడితే, ఆ ధనం ఆదుకుంటుంది. కరోనా కాలంలో ఉద్యోగం లేక, జీతాలు అందక ఎంతోమంది ఇబ్బందుల పాలవుతున్నారు.

తర్వాత శక్తి కలిగితే బంగారం, ఇల్లు కొనుక్కో వచ్చు. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టవచ్చు. కానీ దానికి అనుభవజ్ఞులైన వారి సాయం కావాలి.

ఫస్ట్ శాలరీ వచ్చిన వారికి, పైన చెప్పిన ఆర్థిక ప్రణాళిక లు ఉపయోగపడతాయని అనుకుంటున్నా.

ఆఖరుకు కొద్ది మొత్తం పేదవారికి ఖర్చు పెట్టవచ్చు.

Leave a Reply

Exit mobile version