in ,

పిల్లి అమ్మా అంటుందా?

పిల్లి మ్యావ్, మియ్యావ్ అంటుంది. కాని అమ్మా అనదు-ఎవరైనా చెప్పే సమాధానం ఇదే అయితే తప్పక ఈ వ్యాసం చదవండి.

2006-7 మధ్య సంగతి. గురువు గారు తినే తిండిలో ప్రధమ ముద్ద గుమ్మం బయట పెట్టమన్నారు. సరే నని టిఫిన్ టైములో ఒక ముక్క, భోజనం లో ఒక ముద్ద బయట పెట్టేవాళ్ళం.

ఎలా కనిపెట్టిందో ఒక పిల్లి, నెమ్మదిగా ఆ ముద్దలు తినేది.

వారం వరకు మేము గమనించలేదు. ఒకరోజు భోజనం లేటయ్యింది. పిల్లి వచ్చి గుమ్మం దగ్గర కూర్చుంది. మేము ముద్ద వేయగానే తిని వెళ్ళి పోయేది.

అంతకుముందు ఇంటినిండా ఎలుకలు. అంట్లుమెషిన్ కూడా కొరికాయి. కానీ పిల్లి వచ్చి నా క ఎలుకలు తగ్గాయి. అందుకని దానికి ఆనందంగా పెట్టేవాళ్ళం. ఎప్పుడైనా కోపం చేసి, చిరాకుపడితే, రెండు గంటల లో పలు ఎలుకను చంపి, తెచ్చి, గుమ్మం ముందు పెట్టేది. దాంతో, దాని విలువ తెలిసివచ్చి, నోరుమూసుకుని, దానికి తిండి పెట్టేవాళ్ళం.

మా బాబు కడుపులో పడ్డాడు.చెకప్ కి వెళ్ళి వచ్చేటప్పటికి 3/4గంటలు అయ్యే ది. అప్పుడు నన్ను చూచి అ…….మ్…..మ…… అని సాగతీసి పిలిచేది. నేను మొదట నమ్మలేదు. కానీ అదేపనిగా, నాలుగైదుసార్లు జరిగేటప్పటికి, ఇంట్లో వాళ్ళతో చెప్పాను.

ఇంట్లో వాళ్ళు నమ్మలేదు. గర్బంతో ఉంది, ఏదో భ్రమ అనుకున్నారు. నేను ఊరుకున్నాను. కానీ ఒకసారి మా నాన్నగారు, పిల్లి నా వెనుక బడి, ఆ…మ్….మ అనడం విన్నారు. ఆమాట మిగతా వారితో అంటే యధాప్రకారం తీసి పడేశారు.

డెలీవరీ కోసం హాస్పిటల్ లో వారం ఉన్నాను. సమయానికి ముద్ద దొరక్క, వంటింటి దగ్గర కూచుని-అ…య్…యా…,దే..వా….(అయ్యోదేవా)అని అన్నదట. వంటచేసే మా అమ్మ గారు ఎవరు అని బయటకు చూస్తే పిల్లి. దాంతో ఆశ్చర్యపోయి, దానికి తిండి పెట్టేరట.

ఇప్పుడు అనిపిస్తుంది, దాన్ని ఫోటో తీయలేదని. ఆ రోజుల్లో ల్యాండ్ లైన్ ఫోన్ ఉండేది. సెల్ ఉంటే రికార్డు చేసేవారం. మరి అది ఏమైందీ అని సందేహం రావచ్చు. 2008లో, తులసి బృందావనం లో ( ఒక చోట తులసి మొక్కలు గుబురుగా పెరిగితే ,దాన్ని తులసీ బృందావనం అనేవారం) చనిపోయింది. మందుతిన్న ఎలుకను తిని, మందుగా పనిచేస్తుందని తులసి చెట్ల మధ్య చేరి, ప్రాణం వదిలింది.

తర్వాత పెద్దల ద్వారా తెలిసింది ఏమిటంటే, తర్వాత జన్మలో మనిషిగా పుట్టబోయే జంతువులు, మాట్లాడతాయి పుణ్యవశాన. అది మనుష్య జన్మ నెత్తుతుంది, అని.

ఏమైనా, ఎవరు నమ్మినా, నమ్మకపోయినా, చిలుక, మైనా తర్వాత పిల్లి మాటలు, మాఇంటి ల్లిపాది విన్నాం.

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

గణపతి పూజ వెనుక సైన్స్

గాడిద గుడ్డు