వేదాలు నాలుగు, మరి ఐదో వేదం ఎక్కడిది ? మహాభారతంను ఐదో వేదం గా పరిగణిస్తారు.
రామాయణం ఉండగా, భారతాన్ని ఎందుకు వేదం గా పరిగణిస్తారు, మరి 18పురాణాలు ఉండగా, మహాభారతం కు అంత విలువ ఎందుకు?
ఈ ప్రశ్నలు ఆలోచింప దగినవి. పిల్లలకు కధలు చెపుతున్నపుడు, మధ్యలో సందేహాలు అడుగుతారు. వాటిని తీర్చడం లో నాకు వచ్చి న సందేహాలు, మహాభారతం మీద కొత్త ఆలోచన లకు దారి తీస్తాయి.
నాకు కలిగిన ఆలోచనలను “నాటి భారతం లో నేటి సైన్స్”పేరున కహానియా.కామ్ లో ప్రచురించాను.తర్వాత వాటిలో కొన్ని యూట్యూబ్ లో వీడియో లు గా అప్ లో డ్ చేశాను.
పై వీడియోలు చేశాక , మహాభారతం పంచమ వేదం ఎందుకు అయ్యిందో అర్ధమైనది.
మహర్షులు త్రికాలవేదులు. అనగా భూత, వర్తమాన ,భవిష్యత్తులు తెలిసినవారు. విదేశీ, స్వదేశీ దురహంకారం వలన, ప్రకృతి విపత్తు ల వలన వేద విజ్ఞానం క్షయము అవుతుంది అని తెలిసి, మహాభారతం కధల రూపంలో ,ఆనాటి సైన్స్ ను ఉదహరించారు. నాటి వేదంలో హెడ్ ట్రాన్స్ ప్లాంట్, సరోగసీ, కృత్రిమ గర్భసంచి, 3డి(మయసభ), జీనోమ్, లాంటి ఎన్నో సైంటిఫిక్ విషయాలు ఉండేవి అని నా నమ్మకం.వాటిని జనబాహుళ్యంలో విస్తరించడానికి మహాభారతం లో ఈ సైన్స్ ను అడుగు అడుగున ఉదహరించారు.
మన వారసత్వపు సంపదలను తగలబెట్టారు.సంపదలను దోచుకుని, పేదవారిని చేసి, అజ్ఞానులు అని ముద్ర వేశారు.కానీ మహాభారతం మన విజ్ఞానం మన కనులముందు ఉంచింది.
మహాభారతం గురించి లో గడ ఒక మంత్రి గారు, సైన్స్ సభలో ప్రసంగించిన వెంటనే, సైంటిస్టులు ముక్తి కంఠంతో ఖండించారు.
పై వీడియో లింక్ లో అసలు నేను ఎందుకు మహాభారతం గురించి వీడియోలు, వ్యాసాలు రాశానో వివరంగా చెప్పాను.
ఒక్క విషయం మాత్రం వివరిస్తాను. గ్రీకు వీరుడు అలెగ్జాండర్ భారత దేశం మీదకు దాడి చేసే నాటికి, మహాభారతం ప్రజాబాహుళ్యంలో ఉంది. ఆనాటికే కృత్రిమ గర్భసంచి నుండి కౌరవులు, వారికన్నా ముందే వసిష్ఠుడు, గౌతముడు ఉద్భవించిన ట్లు, ఆసైన్స్ భారతీయుల కు తెలుసని తేటతెల్లమైంది. కాదంటారా?
అందుకే నా అభిప్రాయం ప్రకారం మహాభారతం వేదాలలోని సైన్స్ కు డిక్ష్నరీ గా మారి, పంచమ వేదం గా మారింది.