నానావతి కేసు జ్యూరీ సిస్టమ్ లో ఆఖరి కేసు. ఇది 1959లో జరిగింది.
ప్రధాని నెహ్రూ కూడా ఈ కేసుకు సమాధానమివ్వాల్సి వచ్చింది.
కేసు పూర్వాపరాలు -నానావతి నేవీలో పని చేస్తుంటాడు. లాంగ్ ట్రిప్ లో డ్యూటీ కి వెళతారు. భార్య ముంబైలో ఉంటుంది. ఆమె వంటరి తనాన్ని అవకాశంగా తీసుకుని, హతుడు ఆమెను పార్టీలకు, ఫంక్షన్లకు తిప్పుతాడు. నెమ్మదిగా ప్రేమ మైకంలో ముంచుతాడు.
నానావతి ఇంటికి వచ్చాక, భార్య ప్రేమ గురించి వివరంగా చెపుతుంది. దాంతో నానావతి , హంతకుడిని కలిసి, ఆమెను పెళ్ళి చేసుకోమని కోరుతాడు. హతుడు తిరస్కరించడమే కాక, ఎగతాళి చేయడం, అవమానిస్తాడు.
నానావతి, హనీట్రాపర్ పి చంపడానికి నిశ్చయించుకున్నారు. భార్యతో సినిమాకు వెళ్లి, ఆమెను హాల్లో వదిలి, హనీట్రాపర్ ఇంటికి వెళతాడు. వెళ్ళేముందు, షిప్ నుండి తన పిస్టల్ తీసుకు వెళతారు. హతుడు బాత్రూం నుండి టవల్ కట్టుకొని బెడ్రూంలోకి వస్తాడు. నానావతికి, అతనికి వాగ్యుద్ధం జరుగుతుంది.
ఆవేశంలో షూట్ చేస్తాడు. నానావతి పోలీసులకు లొంగిపోయాడు. అతనికి కొర్టు మరణశిక్ష విధించింది. కానీ రాష్ట్రపతి క్షమాభిక్ష వలన యావజ్జీవ కారాగార శిక్షగా మారుతుంది.
నానావతి మంచి షూటర్. నేవీలో ఎన్నో సేవలు అందించారు. ఆ సేవలను దృష్టి లో ఉంచుకొని, అతనిని విడుదల చేశారు. అతని మీద మూడు సినిమాలు వచ్చాయి.
ఐ పి సీ లో కల్పబుల్ హొమిసైడ్ ఎమౌంట్ టు మర్డర్ ,సెక్షన్ 299&300 చదివేటప్పుడు, ఎవిడెన్స్ యాక్ట్ లో రాష్ట్రపతి క్షమాభిక్ష అధికారం గురించి చెప్పేటప్పుడు, ముఖ్యంగా ఈ కేసును ఉదహరిస్తారు.
ఈమధ్యే బాలీవుడ్లో సినిమాగా విడుదలై, మంచిహిట్ సాధించినది ఈ కేసు.