పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు.
పెడమరలే నవ్వేనే పెండ్లి కూతురు.
అన్నమయ్య కీర్తనలో, పెండ్లి లో తలంబ్రాల గురించి , పెళ్ళి కూతురి గురించి, అమ్మవారి గురించి చక్కగా వర్ణించారు.
అనాదిగా తలంబ్రాల కోసం బియ్యం వాడు తారు. మంచి సమయం చూసి, మేళం పెట్టి, పెళ్ళికి ముందు, కలుపుతారు. ఐదుగురు ముత్తైదువులు, బియ్యంలో పసుపు, ఆవు నెయ్యి, ముత్యం, పగడం, మొదలైనవి వేసి కలుపుతారు.
పెండ్లిలో ఎండు కొబ్బరి చిప్పలో తలంబ్రాలు పోసి, ముంత పైన పెట్టి, మంత్రాలు చదివి నాక తలపై పోసుకోమంటాడు పంతులు . తర్వాత రకరకాల చంకీలు , తేలికపాటి ధర్మాకోల్ బాల్స్ – రకరకాల వస్తువులను తలంబ్రాలు గా పోసుకుంటారు .
పెళ్ళి అయినాక , పోసుకున్న తలంబ్రాల బియ్యం ఏం చేస్తారు ? మామూలుగా ఇంటి చాకలి తీసుకుంటాడు . కానీ ఒకసారి పంతులు తనకి వస్తాయని గొడవ చేశారు. పెళ్ళి లో తలంబ్రాల బియ్యం కోసం , చాకలి , పంతులు గొడవ చేయడం మొదలెట్టారు .
న్యాయం గా ఆదినుండి చాకలి ఇచ్చే అలవాటు ఉంది కాబట్టి , అతనికే దక్కాలని పెద్దలు తీర్మానించారు . పంతులికి కోపం వచ్చింది. దాంతో అతనికి, వ్రతం చేశాక స్వయం పాకం కింద ఎక్కువ బియ్యం ఇస్తామని శాంతి చేశారు .
అసలు ఈ తలంబ్రాల బియ్యం ఏం చేస్తారో నని సందేహం వచ్చింది నెయ్యి వేయడం తో నిల్వ ఉంటుంది. పసుపు వలన క్రిములు చేరవు. చక్కగా పులి హోర వండుకుంటారు .
ఇలా పసుపు బియ్యం తినండం వలన, యాంటీ బయోటిక్స్ గా పని చేసి, ఏం జబ్బులు రావు. చాకలి వారిలో కేన్సర్ తక్కువ – మా చిన్నప్పటి మాట.
ఆలయాల్లో పులిహోర తప్పక నైవేద్యంగా పెడతారు. బ్రాహ్మణులు తప్పక శుక్రవారం పులిహోర తింటారు . నాకు తెలిసిన బ్రాహ్మణులలో కేన్సర్ కేసులు తక్కువ. 80 పై బడి, వృద్దాప్యంతో కాలం చేసిన వారు ఎక్కువ.
కానీ మందు, మాంసం తినే కపట బ్రాహ్మణులకు పై విషయాలు వర్తించవు.
చివరకు ఇచ్చే సలహా ఏమిటంటే, పసుపు వాడండి – పాలలో , కూరల్లో , అన్నాలలో .