Menu
in ,

ట్యూషన్లు అవసరమా?!

ట్యూషన్లు అవసరమా? ట్యూషన్లు లేకుండా, కనీసం పదోతరగతి వారికైనా పిల్లలు చదువు కోలేరా? సొంతంగా చదువుకుంటే మార్కులు రావా?

నా వరకు తల్లి, తండ్రులు చదువుకుంటే, పిల్లలకు ట్యూషన్లు అవసరంలేదు. వెంటనే అందరికీ వచ్చే డౌటు, మీ పిల్లలకు ఎన్ని మార్కులు వచ్చాయి అని.

పిల్లల మార్కులు పబ్లిక్ గా చెప్పడం సేఫ్ కాదు, కాని ట్యూషన్లు చెప్పించుకుని, పరీక్ష రాసిన వారికంటే రెండు మార్కులు మాత్రమే తక్కువ వచ్చాయి.

స్కూల్ లో లక్షలు కడుతున్నాము, మళ్ళీ ట్యూషన్లకు వేలు అవసరమా? అయినా రిస్క్ ఎందుకు అని,పిల్లలను ట్యూషను పెట్టించనా? అని అడిగితే, వద్దు అన్నారు.

స్వేచ్ఛ గా ఎగిరే పక్షిని, పంజరంలో పెడితే ఎంత బాదపడుతుందో, ట్యూషన్ పేరు చెపితే అంత భయపడుతుంటారు.

మరి పిల్లలకు సందేహాలు వస్తే ఎలా. నాకు తెలిసి నవి చెపుతాను. తెలియనివి గూగుల్ లో చూస్తారు. అర్థం కాకపోతే టీచర్ ను అడుగుతారు. ఆఖరు గా స్నేహితులను అడుగుతారు.

చదువుకున్న తల్లి తండ్రులు ఉన్నారు కాబట్టి సరే, మరి చదువుకోని తల్లి తండ్రులు ఉంటే, పల్లెల్లో టీచర్ లు ఎంతమంది పిల్లలను తీర్చి దిద్దటం లేదు. వారికి ట్యూషన్ ఎవరు చెపుతున్నారు?.

ఎల్ కేజీ, యూకేజీ వరకు తల్లి/తండ్రి పర్యవేక్షణలో చదువుకుంటూ, ఆపై తరగతుల్లో సొంతంగా చదువు కోవడం నేర్పించాలి.

చదువుకోవడం ఎవరికైనా ఎందుకు నచ్చుతుంది. కష్టంగా ఉంటుంది. కాని చదువును ఇష్టపడేలా చేయాలి. ఎలా?

కష్టే ఫలి. ఏదీ ఊరికే రాదు. చదివితే నచ్చిన చాకొలేట్ ఇస్తామనాలి. అలా అని లంచాలకు అలవాటు చేయకూడదు. బాగా చదివితే మంచి ప్రోత్సాహం ఇవ్వాలి.

అపుడపుడు పిల్లలను టీ చర్లు గా మారమనాలి. తల్లితండ్రులు స్టూడెంట్ అవ్వాలి. పిల్లల దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాలి. నేను అప్ లోడ్, డౌన్లోడ్, వీడియో మేకింగ్, ఎడిటింగ్ -లాంటివి పిల్లల దగ్గర నేర్చుకున్నాను.

నేను యూట్యూబ్ ఛానల్ మొదలెట్టాను. ఎందుకంటే వీడియో పాఠాలు ప్రయోగం చేశాను. దాన్ని ఎవరిమీద చూపించాలి. ఏదైనా వీడియో తేడా వస్తే మా పిల్లలు సాయం చేస్తారు. ఆ వీడియో లు అప్లోడ్ చేయడానికి ఒక మాధ్యమం కావాలి. సో, ఇప్పుడు నేను ఒక యూట్యూబర్ని. నాకు గురువు లు నా పిల్లలు.

మరి ట్యూషన్ కెళ్ళే పిల్లలు ఎంతమంది తల్లిదండ్రులకు పాఠాలు చెపుతున్నారు? అసలు సమయం ఎక్కడ? పగలు స్కూల్. సాయంత్రం ట్యూషన్. రాత్రికి హోం వర్క్. సమయమెక్కడ?

మా పిల్లలు సాయంత్రం హోం వర్కు చేసి, రాత్రి కి కధలు అడుగుతారు. వారికి కధలు చెప్పి, చెప్పి, చివరకు రచయిత్రిని అయినాను.

చివరకు నేను చెప్పే దేమిటంటే పిల్లలకు సొంతంగా చదువు కునేలా అలవాటు చేస్తే, వారు తల్లి తండ్రులకు ట్యూషన్ చెప్పగలుగుతారు.

కానీ ఇంటర్ లో కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి, కోచింగ్, ట్యూషన్,పెట్టాలి. అప్పుడు సొంతంగా చదువు కునే పిల్లలు ఒత్తి డిని ఈజీగా తట్టుకుంటారు.

Leave a Reply

Exit mobile version