ఇది నిజం గా జరిగిన కధ. ఈ కధ 15 శతాబ్దం లో జరిగింది. ఒడిసాలో జరిగింది.
1466-1497 లో ఒరిస్సా ను ఏలిన రాజు పురుషొత్తముని కధ ఇది. పురుషోత్తమునికి, తన కూతురు పద్మావతి ని ఇచ్చి పెళ్ళి చేయడానికి నిశ్చయించారు కంచి రాజు. పూరీ జగన్నాధ రావు యాత్ర ను చూడాలని, కంచి రాజు పూరీ వెళతాడు.
యాత్ర ప్రారంభంలో పురుషోత్తముడు, బంగారు చీపిరితో, రధాలను ఊడుస్తారు. అది చూసి కంచి రాజు, ఊడ్చేవానికి కూతుర్ని ఇవ్వను -అని అవమానించి, వెళ్ళి పోతాడు.
పురుషోత్తముడు,కంచి రాజు మీద కసి తీర్చుకోవాలని, యుద్ధం చేస్తాడు. కానీ ఓడిపోయి, మరలా అవమానం తో పూరి చేరుకుంటారు. స్వామి దగ్గర తన భాదను వెళ్ళగక్కి, పూజలు చేసి, మళ్ళీ సైన్యం ను కూడగట్టి, యుద్ధానికి వెళతాడు.
జగన్నాధుడు, బలభద్రుడు పురుషోత్తముని కి సాయం చేయాలనుకుంటారు. తెల్లని గుర్రం మీద నల్లని స్వామి, నల్లగుర్రం మీద తెల్లని బలభద్రుడు, ముందు గా వెళతారు.
దారిలో బలభద్రునికి దాహం వేస్తుంది. అక్కడ ఒకామెను మజ్జిగ అడుగు తారు. ఆమె మజ్జిగ ఇస్తుంది. బలభద్రుడు తన ఉంగరం ఇచ్చి, వెనుక మా రాజు వస్తున్నాడు, అతను నీకు డబ్బిస్తాడు, ఈ ఉంగరం చూపు, అని వెళ్ళి పోతారు.
తర్వాత పురుషోత్తముడు తన సైన్యం తో రావడం తో, మజ్జిగ డబ్బులు అడుగుతుంది. నా సేనాధిపతిలు అంతా నాతో నే ఉన్నారు.వారెవరో నాకు తెలియదు అంటారు. ఆమె వారిని వర్ణించి, ఉంగరం ఇస్తుంది.
పురుషోత్తముడు ఉంగరం జగన్నాధునిదిగా గుర్తించి, స్వామి తనను ఆశీర్వదించారు, గెలుపు ఖాయమని అర్ధం చేసుకుంటారు. మజ్జిగ డబ్బు లు చెల్లించి, యుద్ధానికి ఉత్సాహంగా వెళతారు.
యుద్ధం లో పురుషోత్తముడు గెలుస్తారు. పద్మావతిని, ఊడ్చేవానికి ఇచ్చి పెళ్ళి చేయమని మంత్రిని ఆదేశిస్తాడు. ఆమె తండ్రి తనకు చేసిన అవమానానికి, అదే సరైన శిక్ష గా వెల్లడిస్తారు.
మంత్రి , పద్మావతి పి పూరీకి తీసుకొస్తాడు. కాలం గడుస్తుంది. జగన్నాధుని రధయాత్ర ఆరంభం అవుతుంది.పురుషోత్తముడు బంగారు చీపిరితో, రంధ్రాలను ఊడుస్తాడు. ఆ సమయం లో మంత్రి పద్మావతి ని పెళ్ళి చేసుకోమని, ఇంతకన్నా చక్కగా ఊడ్చే వాళ్ళు మరొకరు పద్మావతికి దొరకని, ఆమె చేత మెడలో పూలమాల వేయించి, వారు నిశ్చయం చేయిస్తాడు.
మంత్రి చాతుర్యానికి ముగ్ధుడై, పద్మావతి ని భార్య గా స్వీకరించారు పురుషోత్తముడు.ఆ విధంగా చీపురు పెళ్ళి చేసింది.
ఇప్పటికీ పూరీ జగన్నాథ రథయాత్రలో బంగారు పిడి కల చీపురుతో, రాజు రధాలను ఊడుస్తారు.