in

గంగిరెద్దు

సంక్రాంతి వస్తే పల్లెల్లో  గంగిరెద్దుల హడివిడి . పట్నం లో తక్కువ .

అయ్య వారికి దండం పెట్టు, అమ్మవారి కి దండం పెట్టు – ఇలా అని, ఇచ్చిన బియ్యం తీసుకుని, చల్లగా ఉండాలని దీవించి వెళతాడు గంగిరెద్దుల వాళ్ళు .

పిల్లలను బస్టాప్ కి తీసుకు ని వెళుతుంటే, మామూలు ఎద్దుకు, పెట్టుడు మూపురం కట్టి, అలంకరిస్తున్నారు. దాంతో ఆశ్చర్యం పొయాను. మధ్యాహ్నం వేళ మా ఇంటి కి వచ్చాడు. పోనీ పాపం అని, బియ్యం వేశాం .

అమ్మా డబ్బు ఇమ్మన్నాడు. ఐదు రూపాయలకు తక్కువ తీసుకోను, అని డిమాండ్ చేశాడు. దాంతో వాళ్ళు మండి , తర్వాత వచ్చినా ఇవ్వడం మానేశా .

మా అక్క, అయ్యో పాపం, గంగిరెద్దు, అనుకుంటూ, బియ్యం, కూరగాయలు దానం చేసింది. యధా ప్రకారం డబ్బు అడిగాడు. ఏదో పండుగ సందర్భంగా, పోనీలే అని ఇచ్చి పంపింది.

సాయంత్రం పనమ్మాయి వచ్చి, కూరల ధరలు మండి పోతుంటే, వాకిట్లో పారబోసేరేమిటమ్మా. నాకైనా ఇచ్చారు కాదు. ఒక పూట కి ఎలమారి పోతుంది, అన్నది .

అప్పుడు బయటకు వెళ్ళి చూస్తే, కూరలు తొక్కి ఉన్నవి. డబ్బు, బియ్యం తీసుకుని, కూరలు నేలమీద పడేశాడు. ఎద్దు చూసుకోక కాలితో తొక్కింది.

దాంతో మా అక్క కి ఒళ్ళు మండింది. నీవు చెప్పిందే కరెక్ట్. ఈ సారి నుంచి నేను జాలి పడను -అంది. తర్వాత నుంచి మేము గేటు గడివేస్తూ, పిలిచినా పలకడం మానేశాం.

మూగజీవాలను అడ్డం పెట్టుకొని, డబ్బు లు యాచించి, వాటితో జల్సా లు చేసేవారికి దానం చేయకపోయినా పాపం రాదు. కాదంటారా??

Report

What do you think?

60 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

తలంబ్రాలు

నల్గొండ ట్రెక్కింగ్