Menu
in ,

క్యాల్షియం ట్యాబ్లెట్ [Must Read]

35-40 వయసు వారిని, ముఖ్యంగా ఆడవారిని డాక్టర్లు క్యాల్షియం ట్యాబ్లెట్ వేసుకోమంటున్నారు.

మొన్నామధ్య తెలిసినవారు, చుట్టాలు,పక్కాలు చాలా మంది కి స్టంట్ లు వేశారు.లావు,సన్నం తో పని లేదు.హార్ట్ వాల్ బ్లాక్ అయ్యింది, స్టంట్ వేశారు.

కొవ్వు ఎక్కువగా ఉంటుంది అనుకున్నాము.పలకరింపులకు వెళ్ళాక తెలిసింది అది కొవ్వు కాదు, క్యాల్షియం గడ్డలు బ్లాక్ చేశాయని.

ఈ మధ్య క్యాల్షియం బ్లాక్ లు ఎక్కువయ్యాయి.నలుగురు చేరి దీని గురించి చెప్పుకుంటున్నారు.

ఒకామె- నెల వేసుకుని, నెల మానేస్తారు, అంటే ఆల్టర్ నేట్ మంత్లీ వేస్తాను, అంది.

ఇంకో ఆమె ఆల్టర్ నేట్ డేట్స్ లో అంటే రోజు విడిచి రోజు వేస్తుంది.

మరొకామె  వారం విడిచి వారం,ఇంకో ఆమె నెలలో సగం రోజులు వేసుకుని,మిగతా సగం మానేస్తా-ఇలా ఆన్ అండ్ ఆఫ్ లో క్యాల్షియం వేసుకుంటున్నారు.

నేను ఇంట్లో ఈ విషయం మై మాట్లాడుకుంటే అమ్మమ్మ లు గుర్తుకొచ్చారు. మా అమ్మమ్మ 90ఏళ్ళ  పైన బతికింది. పోవడానికి పదేళ్ళ ముందు అంటే 80ఏళ్ళ వయసు వరకు పీట మీద కూర్చుని కాఫీ, టిఫిన్, భోజనం, కూరగాయలు కోయడం-చేస్తుండేది. మేమంతా టేబుల్ పైన భోజనం చేస్తే, ఆమె పీఠ పైన కూర్చునేది.

మొన్నామధ్య మా పిల్లలు కాళ్ళు నొప్పులు అని ఏడుపు, పని చెపితే చాలు ఇదో వంక. డాక్టర్ ని అడిగితే క్యాల్షియం, జింక్ ఇచ్చారు. పెరిగే పిల్లలు, ఎముకల మధ్య ఖాళీ ఉంటుంది. అవి పెరిగి సర్దుకునేటప్పుడు నొప్పి వస్తాయన్నారు.

అమ్మాయి ,మోకాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, హాస్పిటల్ కి తీసుకు పోవా-అని అడిగింది మా అమ్మ. పక్కలో బాంబు పడ్డట్టు భయపడ్డాను.

అసలే కరోనా కాలం, ఆమె వయసు 70పై బడింది. బయటకి వెళ్ళడమే. సునామీ అలల లా ఎగిరిపడ్డా,గయ్ మంటూ. ముప్పైఏళ్ళ నుంచి భరిస్తున్నావు, ఇంకో సంవత్సరం భరించు. బయటకు మాత్రం తీసుకుపోను-అని తేల్చేశా.

ఏదో పెద్దావిడ  బయటకు పంపకూడదని అన్నానే కానీ, 45పై బడిన నాకు కాళ్ళ నొప్పులు. నేలమీద కూర్చో లేను. అదుగో ఆ సమయంలో మా అమ్మమ్మ ఎలా 80ఏళ్ళు దాటినా, నేల పీఠ మీద, కత్తి పీట మీద కూర్చుని, పైకి లేచేదో -అని ఆమెను తలుచుకున్నాము.

మా అమ్మమ్మ చిన్నతనంలో బియ్యం తక్కువ గా పండేవట. వాటిని పండుగకు, పబ్బాలకు, చుట్టాలు వచ్చినపుడు తినేవారట. రోజు జొన్నలు, సజ్జలు, అరికెలు, సామలు-లాంటివి తినేవారట.

ఇక సాయంత్రాలు నువ్వు పిండి (నువ్వు లు వేపి, బెల్లంతో కలిపి, దంచి,డబ్బాకెత్తుతారు) గిన్నెడు తినేవారట. వంటకు నెయ్యి, నువ్వు ల నూనె వాడేవారు.

ఈ విషయం మా అమ్మమ్మ మాకు చెప్పేది అన్నం తినే సమయంలో. తెల్లని అన్నం చూసి , వేస్ట్ చేయకండి, మా చిన్నప్పుడు ఈ అన్నం కోసం పండుగ ఎప్పుడు వస్తుంది అని చూసేవాళ్ళం. మీకు ఆ కష్టం లేదు అని.

ఇదంతా గుర్తు చేసుకుని, నువ్వు లుండలు చేసి, మూడు తరాల వాళ్ళం తిన్నాం. ఇదే క్యాల్షియం ట్యాబ్లెట్, నొప్పులు తగ్గిపోతాయి, అమ్మమ్మ వైద్యం అని అందరిని నోరుమూయించాను.

నొప్పులు తగ్గినా, వేడి చేస్తుంది. కాబట్టి తగుమాత్రంగా తినాలి. మజ్జిగ వాడాలి. వానాకాలం చిలికి, ఈ వేడి ఆరోగ్యం.

ఇకపై ఏం వయసు వారైనా నువ్వు వుండును తప్పక తినండి. షుగర్ ఉంటే కారంపొడి కొట్టుకుని అన్నంలో తినండి, కూరల్లో చల్లుకోండి.

Leave a Reply

Exit mobile version