కృష్ణుడు జగత్తు కంతా గురువు. ఎలా అంటారా?
పక్కవారి ఇళ్ళ ల్లో వెన్న తింటున్నాడని యశోదమ్మ రోలుకేసి కడితే, వెన్న తిన్న బలం తో రోలు లాగి, మద్ది చెట్ల కు మోక్షమిచ్చాడు.
ఎపుడో ద్వాపర యుగంలో యశోదమ్మ చేసిన పని, నేడు అందరికీ ఆమోదయోగ్యమైనది.
బ్యాంకు కెళితే పెన్ను ను దారంతో కట్టి ఉంచుతున్నారు, ఎవరూ ఎత్తుకు పోకుండా.
రైలులో మగ్గులకు ఇనుప గొలుసులు వేస్తున్నారని ఆ మధ్య పెద్దలు గగ్గోలు పెట్టారు.
మంచినీరు తాగే దగ్గర గ్లాసులను గొలుసులతో కట్టేస్తున్నారు.
పిల్లలను కట్టడానికి కుర్చీలు అమ్ముతున్నారు. మంచి లాభసాటి వ్యాపారం.
ఒక తెలివైన ఇల్లాలు లైటరు, పీలరు, కత్తి, కత్తేర లాంటి వస్తువులు, డైనింగ్ టేబుల్ మీద కు, ఆఫీస్ టేబుల్ దగ్గరకు మీటింగ్ల కు వెళుతున్నాయని, వాటిని వంటింట్లో కిటికీ కి తాడు వేసి కట్టేసింది. దాంతో ఇంట్లో అందరికీ డిసిప్లిన్ అలవడింది. (మరి వస్తువు మన దగ్గరకు రాక పోతే, మనమే దాని దగ్గరకు వెళ్ళాలి. ఎక్కడ పెట్టినవి, అక్కడే ఉంటాయి.)
గుడికెళితే ఒక తండ్రి, పూజారి నుంచి సలహా అడిగాడు-మా పిల్లాడు బాగా చదవాలి అంటే ఏమి చేయాలి??
దానికి పంతులు తన తండ్రి, తెల్లవారుజామున లేపి వేదాలు వల్లే వేయమని చెపితే, కునికిపాట్లు పడుతున్నానని, నా పిలకకు తాడు కట్టి, దాని కొస కిటికీ గ్రిల్స్ కి కట్టారు. నేను నిద్రతో తూగినపుడు, నా పిలక లాగబడి, మేలుకొని, చదివేవాడిని. అప్పుడు మా నాన్న అలా చేయబట్టే, ఇప్పుడు నేను ఈ స్థాయికి చేరుకున్నా. మీరు అలా చేయండి-అని.
అమ్మా యశోదమ్మా, లోకమంతా నిన్నే కాపీ కొడుతుంది. పేటెంట్ ఆ రోజుల్లో లేక పోయింది, ఉండి ఉంటే కృష్ణాలయాలైనా బాగుండేవి.
పంచభూతాలు విష్ణు మూర్తి దగ్గరకు వెళ్ళి – ” భూలోకంలో జనాలు మమ్మల్ని కలుషితం చేస్తున్నారు.. రక్షించమని వేడుకున్నాయట”.
దానికి విష్ణు మూర్తి- వారి పాపం పండు తుంది త్వరలో., వారు ముక్కు, మూతి మూసుకుని, చేతులు కట్టుకుని, ఇళ్ళల్లో నే బందీ అవుతారు-అని వరమిచ్చారట.
ఎవడు తీసుకున్న గోతిలో వారే పడతారు అన్నట్లు- చైనా సృష్టించిన కరోనా ప్రపంచాన్ని ఒక ఊపు ఊపి, జనాలను ఇంటికే పరిమితం చేసింది. అన్నిటిని స్తంభించింది.
వృక్షో రక్ష తి రక్షితః,ధర్మో రక్షతి రక్షితః-లాంటి పెద్దల మాటల్ని పాటించండి. పంచభూతాలను(నీరు, నిప్పు, భూమి, ఆకాశం, వాయువు) కాలుష్యం నుంచి రక్షించండి.
అప్పు డు పూతన నుండి విషాన్ని గ్రోలి, ముక్తి నిచ్చిన చిన్నిశిశువు, కరోనాను త్రోలి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఎంతైనా జగత్తు గురువు కదా.
అన్నట్లు మరిచాను. ద్వాపరం లో నీటిలో ద్వారకను నిర్మించిన విషయం తెలిసి, నేడు సముద్రంలో సిటీలను నిర్మిస్తున్నారు.(సింగపూర్, అరబ్ దేశాలలో).
అందుకే కృష్ణం వందే జగద్గురుమ్!! కాదంటారా?!