Menu
in ,

కాపీ

పరీక్షలో కాపీ కొట్టడం, డీ బార్ అవ్వడం సాధారణంగా అందరికీ తెలిసినవే. కానీ పుస్తకాల పేర్లను కాపీ అని తీసుకోవడం ఒక ఫన్నీ ఇన్ సిడెంట్.

మా చిన్నప్పుడు 7&10పరీక్షలు పబ్లిక్ పరీక్షలు. మిగతా తరగతులు అటెండెన్స్ ఉంటే పాస్ అవ్వచ్చు. కానీ పబ్లిక్ పరీక్షలు వేరే స్కూల్లో రాయాలి. మొదటి సారి పబ్లిక్ పరీక్షల్లో కొద్ది గా భయం, బెరుకు ఉంటాయి.

మా అక్క పెన్సిల్ బాక్స్ టేబుల్ మీద పెట్టి పేపర్ కోసం చూస్తుంది. కానీ తన బాక్సు లో పేపర్ ని తీయలేదు. ఇన్విజలేటర్ వచ్చి , తిట్టి,ఆ పేపర్ తీసుకుని వెళ్ళింది. ముందే తీసుకో బట్టి సరిపోయింది, లేకపోతే మధ్యలో చూస్తే డిబార్ చేసేవారు, అని నసిగింది.

మొత్తానికి పరీక్ష అయి పోయాక మేడమ్ దగ్గరికి వెళ్ళి ,తన పేపర్ వాపస్ అడిగింది. దాంతో పిల్ల ధైర్యానికి ఆశ్చర్యపోయి, అసలు అందులో ఏముంది అని అడిగింది. నవలల పేర్లు అనే టప్పటికి, ఆమె కాగితం తీసుకుని చూసింది. 200 నవలల పేర్లు ఉన్నాయి.

మాది రెడ్డి సులోచనారాణి, యద్దనపూడి సులోచనారాణి, కోడూరి కౌసల్యాదేవి-వీరు రాసిన ప్రసిద్ధ నవలల పేర్లు ఉన్నాయి. దాంతో ఈ లిస్ట్ ఏమిటి అని నవ్వుతూ అడిగింది.

అసలు విషయం ఏమిటంటే మా అక్కా, తన ఫ్రెండ్ పోటీ పెట్టుకున్నారు. ఎవరు ఎక్కువ నవలలు చదువు తారోనని. మా అక్క తాను చదివిన నవలల పేర్లు పేపర్లో రాసుకుని, బాక్స్ లో పెట్టుకుంది, తీయడం మర్చిపోయింది.

మేడమ్ , మంచి నవలలు చదివావు, వెల్ డన్, అని కాగితం ఇచ్చేసింది. తర్వాత నుండి పరీక్షలకు వెళ్ళే టప్పుడు కాగితం ముక్క కూడా లేకుండా, చెక్ చేసుకుని వెళుతున్నారు.

మరి పోటీలో ఎవరు గెలిచారు అని మాత్రం అడగొద్దు., పరీక్షలు అవ్వగానే, మేము వేరే ఊరు వెళ్ళిపోయాం ట్రాన్స్ఫర్ వలన. కానీ ఈ సంఘటన గుర్తు కొస్తే నవ్వు కుంటాము.

Leave a Reply

Exit mobile version