Menu
in ,

కానిస్టేబుల్ కూతురు కట్నం ఇవ్వక పోతే ??

ఇది1984 లో జరిగింది.కానిస్టేబుల్ కూతురి ని  అడిగిన కట్నం ఇవ్వలేదని, విషం పెట్టి చంపారు. వివరాల్లోకి వెళితే-

విడాకుల కోసం కోర్టు కి కేసు వచ్చింది.కానిస్టేబుల్ కూతురు .చక్కగా ఉంది.కట్నం తక్కువైనా , పిల్లవాడు,అమ్మాయి నచ్చిందని, పెళ్ళి చేసుకున్నాడు.కొన్ని రోజులు గడిచాయి.

కట్నం తక్కువ ఇచ్చారు,ఇంకా తెమ్మని వేధించేవాడు. వేధింపులు భరించలేక విడాకుల కు ,కేసు ఫైల్ చేశారు.రూల్ ప్రకారం, అప్లికేషన్ పెట్టాక, ఇంకో ఛాన్స్ ఇస్తారు,కలిసి ఉండటానికి.

అమ్మా యి చక్కగా ఉంది, ఒకసారి కలిసి మాట్లాడుకోండి ,అని జడ్జి గారు , వారికి ఏకాంతం కల్పించారు.అంటే చెట్టు కింద , కూర్చుని మాట్లాడుకోమని, వారిని అత్త -మామలు ప్రభావితం చేయకుండా,ఒక అమీనా ని కాపలాగా ఉంచారు.

మాట్లాడు కుని ,కలిసి ఉండటానికి నిర్ణయిం చుకున్నారు. కొన్నాళ్ళు కాపురం చేసి, పడకపోతే, విడాకులు మంజూరు చేస్తానని జడ్జీ గారు, రూల్ ఫాలో అయ్యారు.

మర్నాడు అర్ధరాత్రి, జడ్జీ గారి కి డీ.డీ(డైయింగ్డిక్లరేషన్) రికార్డింగ్ కి(చనిపోయేముందు ఇచ్చే వాంగ్మూలం) రమ్మని కబురు వచ్చింది.

అక్కడ విడాకుల కోసం వచ్చిన అమ్మాయి ,చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతుంది.కోర్టు నుంచి వెళ్ళాక బాగానే ఉన్నారు.మర్నాడు, ఆహారం లో ఏదో కలిపి పెట్టారు, వాంతులైనాయి, హాస్పిటల్ కు తీసుకు వెళ్ళమన్నా ,  తీసుకెళ్ళలేదు,రిక్షా ఎక్కి,ఫలానా కాని స్టేబుల్ కూతుర్ని,అని చెప్పి,పడిపోతే,అతను పోలీస్ స్టేషన్ కి తీసుకొని వెళ్ళి తే,వారు హాస్పిటల్ లో చేర్పించి, జడ్జీ గారి కి కబురు చేశారు.

ఆ అమ్మాయి చనిపొయింది, భర్త, అత్త, మామకు కఠినశిక్ష విధించారు. కట్నపిశాచి కోరలకు కానిస్టేబుల్ కూతురు బలి అయ్యింది.

Leave a Reply

Exit mobile version