Menu
in ,

కమోడ్

హెడ్డింగ్ చూడగానే అసహ్యం పుడుతుంది. అసలు దీని మీద రాయాలన్నా, చెప్పాలన్నా, చదవాలన్నా చిరాకు వస్తుంది. కానీ, ఆరోగ్యరీత్యా దీని మీద రాయక తప్పడం లేదు. చదువరులు అర్ధం చేసుకోగలరు.

ఈ మధ్య పేపర్లో కరోనా, కమోడ్ ఫ్లష్ కొడుతున్న ప్పుడు, నీటి బిందువుల తో వ్యాప్తి చెందుతుంది అని -చదివాను. దాంతో దీనిమీద ఈ వ్యాసం రాస్తున్నాను.

వెనకటికి మా పెద్దబ్బ వరుస, ఒక బందువు అమెరికా వెళ్ళి వచ్చారు. ఇక అక్కడి విషయాలు, ముఖ్యంగా కమోడ్ గురించి చెప్పేవారు. అక్కడ అంతా తుడుచుకోవడమే, కడుక్కునే పని లేదు. ఛీఛీ. నేను బయటకు వెళితే జేబులో ఒక టీ గ్లాసు వేసుకుని వెళ్ళే వాడిని, కడుక్కోవడానికి-అని చెపితే, ఆ మాటలు ఆయన అవస్ధలు విని నవ్వుకున్నాం.

అమెరికాలోని బంధువు ని కదిలిస్తే, యూరిన్ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి తరుచూ -అని చెప్పింది. పెరుగు, మజ్జిగ తీసుకుంటే, తరుచూ రావడం తగ్గింది. కాని పబ్లిక్ కమోడ్ వాడటం వల్ల అప్పుడప్పుడు వస్తుందని చెప్పింది.

మనకు కడుక్కోవడం అలవాటు, తుడుచుకోవడం తెలీదు. మనం డైరెక్ట్ గా కమోడ్ మీద కూర్చుంటాము. తర్వాత ఫ్లష్ కొడతారు.

కాని అమెరికా లో కమోడ్ మీద పేపర్ వేసి, విసర్జన అయినాక, పేపర్ పడవేసి, వెట్ పేపర్ తో శరీరభాగాలు తుడుచుకుని, శుభ్రం చేసుకుంటారు. ఈ విషయం చాలా మందికి తెలియదు.

మనం కూడా డైరెక్ట్ గా కమోడ్ మీద కూర్చుంటాము. మన ముందు దాన్ని వాడిన వారు, ఫ్లష్ కొడతారు, కానీ సీటు కడగరు. మగవారికి దీనివలన తక్కువ ఇబ్బంది అయినా, ఆడవారికి త్వరగా ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి.

అమ్మమ్మ లకాలంలో సెర్వికల్ క్యాన్సర్ అసలు ఉందా? అప్పుడు నేల టాయిలెట్లు వాడేవారు. అది శరీరానికి తాకదు. కానీ బిందువులు చిందిపడతాయని, చాదస్తంతో స్నానం చేసేవారు, మలవిసర్జన తరువాత. అందుకనే ఇన్ఫెక్షన్లు, క్యాన్సర్ లు తక్కువ.

అంటే కమోడ్ వలన క్యాన్సర్ లు వస్తాయని నా ఉద్దేశ్యం కాదు. కమోడ్ వాడేటప్పుడు పేపర్ వేయడం, లేదా సీట్ మీద నీరు పోసి తర్వాత వాడుకోవడం, తర్వాత శరీరభాగాలు శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా వ్యక్తి గత శుభ్రతను పాటిస్తే ఇన్ఫెక్షన్లు తగ్గుతాయని.

ఇంకో విషయం కమోడ్ శుభ్రపరచడం. ముందు సీట్ మీద క్లీనింగ్ చేసి, తర్వాత లోపల చేయాలి. కానీ క్లీనర్స్ ముందు లో పల తడిగా ఉందని, బ్రష్ నీటిలో ముంచి, సీట్ మీద రుద్దుతారు. లోనా, బయటా అంతా కలగాపులగం చేస్తారు. వారు బాగా కడిగినా, కలగాపులగం వలన, సీట్ మీద క్రిములు చేరుతాయి.

బ్రష్ లో రెండు వైపులా కుచ్చులుంటాయి. ఒకవైపుది సీట్ క్లీనింగ్ కి, రెండవ వైపుది లోపల క్లీనింగ్ కి వాడుకుంటే మంచిది. మోకాళ్ళ నొప్పు లవలన కమోడ్ తప్పని సరి అయ్యింది. కానీ జాగ్రత్తలు, శుభ్రత పాటించాలి. ఆరోగ్యమే మహా భాగ్యం.

సూచన-ఈ వ్యాసం ఎవరికైనా ఇబ్బంది కలిగిస్తే క్షంతవ్యురాలను.

Leave a Reply

Exit mobile version