1956 చట్టం ప్రకారం, వారసత్వపు ఆస్తికి మగవారు మాత్రమే హక్కు దారులు. వారసత్వం అంటే ముత్తాత,తాత, తండ్రి, కొడుకు, మనవుడు, మునిమనవడు-ఇలా తరాతరాలుగా, వంశపారంపర్యంగా వచ్చే ఆస్తి.
ముత్తాత కు 100ఎకరాలు పొలం ఉంటుంది. అతనికి కూతురు, కొడుకు ఉంటే, మొత్తం కొడుకుకు వస్తుంది. ముత్తాత కు 100ఎకరాలు తాతల నుంచి వచ్చింది.
ముత్తాత ఉద్యోగం చేసి, 10 ఎకరాలు సొంతం గా కొంటాడు. ఆ సొంత ఆస్తికి, వీలునామా రాయకపొతే, కూతురికి వాటా వస్తుంది.
ముత్తాత చనిపోయారు. తాత, తండ్రి, వేరుపడాలనుకుంటారు. తాత తరంలో, తండ్రి తరంలో మగపిల్లలు , ఆడపిల్లలు ఉంటారు. అందులో ఒక కొడుకు చనిపోయిన, అతని భార్య గర్భవతి అయి ఉంటుంది. మగవాడు పుడితే వాడికి వాటా వస్తుంది. ఆడపిల్లకు రాదు.
1985 లో, ఎన్టీఆర్ ఒక ఎమండమెంట్ తెచ్చారు. 1984, సెప్టెంబరు నాటికి పెళ్ళి కాని ఆడపిల్లలకు, వారసత్వపు ఆస్తి లో వాటా వస్తుంది. కాని అంతకుముందు, పెళ్ళి అయిన వారికి అర్హత లేదు. అయితే, ఆడపిల్లలకు ఆస్తి పంచి ఇమ్మని అడిగే హక్కు లేదు. కానీ, అన్నదమ్ములు పంచుకుంటే, ఆమెకు వాటా ఇవ్వాలి. ఈ రూలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు మాత్రమే వర్తిస్తుంది.
2005లో సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఈ రూలు భారతదేశం మొత్తానికి అమలయ్యింది.
2020లో ఆడపిల్లకు కూడా పుట్టుకతోనే వారసత్వపు ఆస్తికి హక్కు దారులని,పెళ్ళైనా వారికి హక్కు ఉంటుంది అని తీర్పు వచ్చింది.
ఈ రూలు ద్వారా పెళ్ళి తో సంబంధం లేకుండా, ఆడవారు, తాతగారి ఆస్తికి, సమాన వారసులవుతారు. ఇది సంతోషించాల్సిన విషయమే.
అయితే ఇక్కడ ఆస్తి హక్కు తో పాటు, భాద్యతలు కూడా ఆడపిల్లలకు వర్తిస్తాయి. వృద్ద్యాప్యం తో అవస్థ పడుతున్న పెద్దలను వదిలి, ఆస్తి పట్టుకు పోతే, పెద్దలు తమను సంరంక్షించమని, కొడుకుతో సమానం గా కూతురు పైనా కేసు వేయవచ్చు. కోడలు, అల్లుడు కూడా భాద్యతలు వహించాలి.
ఇన్నాళ్లు ఆస్తులు, భాద్యతలు మగపిల్లలకు మాత్రమే వర్తించాయి. కాని, ఇక పై ఆడపిల్లలకు వాటిలో వాటా వర్తిస్తుంది. ఇప్పుడు ఆడ, మగా సమానం.