in ,

ఆకాష్

ఆకాష్ నా మిత్రుడు . మంచి వారికి మంచి వాడు ,చెడ్డవారికి చెడ్డవాడు . ఒకోసారి అందరికీ సాయం చేస్తాడు . కోపం వస్తే అంతం చూస్తాడు . ఏమైనా మిత్రుడు మిత్రుడే .

కుర్చీ లు దుమ్ము పట్టిన వి , కడగమని పనమ్మాయి కి చెపితే, రేపు- మాపు అని వాయిదాలు వేస్తుంది .  గట్టిగా ఏమన్నా అందామంటే పని మానేస్తుందేమో అనే భయం .ఈ లో పల   ఆకాష్ కబురు చేశాడు . 

అప్పుడప్పుడు ఆకాష్ నా కు సహాయం చేస్తుంటాడు . అలసిపోయాను , చెట్లకు నీరు పోయాలి అని అడిగితే , తప్పక వచ్చి ,నీరు పోసి వెళతాడు . సరే ఆకాష్ వస్తున్నాడు కదా అని కుర్చీ లను బయట పెట్టాను . 

నాకు టైం లేదు ఇప్పుడు కడగనన్నా బయట పెడుతున్నారు. ఎందుకు ? అని గయ్ మంది పనమ్మాయి . 

నిన్ను ఎవరు కడగమన్నారు ? ఆకాష్ వచ్చి కడుగుతాడు -అన్నా .

ఆకాష్ ఎవరు ? అతనికి ఇచ్చే పైసలేదో నాకే ఇస్తే నేనే కడిగే దాన్ని కదా అని నసిగింది . దాని బాధ దానిది . దీన్ని పనిలో నుండి తీసేస్తానేమోనని .

ఆకాష్ నా దోస్త్ , ఉచితంగా సాయం చేస్తాడు , పదో లో పలు పని కానీ ,అని ఇంట్లో కి వెళ్ళా.నా వెనుక వచ్చి నా దాని ధ్యాస గేటు మీద ఉంది . చాలావరకు ఓపిక పట్టింది . కానీ తర్వాత  ఆశక్తి తో మీ దోస్త్ ఇంకా రాలేదు -అంది.

ఆకాష్ మాట ఇస్తే తప్ప డు, పద చూద్దాం అని బయటకు వచ్చి చూస్తే , కుర్చీ లన్నీ కడిగి ఉన్నాయి . వాటిని వంచి , నీరు జారినాక లోపలి కి తీసుకెళ్ళి ,పొడి గుడ్డతో తుడిచాను . ఈ లో పల చిన్నగా తుంపర మొదలై నది. దాంతో వానలో కుర్చీ లను కడిగానని అర్ధమై , దాని మొహం లో నవ్వు వచ్చింది.

ఆకాష్ అంటే ఆకాశం , ఉరిమి కబురు చేశాడు . దాంతో నీరు , కరెంట్ ఆదా చేయడం కోసం నేను కుర్చీలను కడిగాను , వానలో . కరెంట్ ఎలా ఆదా అంటారా , వందల అడుగుల నుండి బోరు మోటార్ ద్వారా నీటిని తో డి , సంపు నింపి , తర్వాత మేడపై న ట్యాంకు నింపాలి . దాని కి కరెంటు ఖర్చు అవుతుంది . మరి ఆకాష్ చక్కగా కడిగి , నాకు ఖర్చు లేకుండా చేశాడు కదా . మరి మిత్రుడు మిత్రుడే కదా . 

నిండు వేసవి కాలంలో వేడి అధికంగా ఉన్నపుడు ,గబగబా వచ్చి చల్లబరుస్తాడు . రోడ్డు వేసేటప్పుడు , మురుగు కాల్వలు లేకుండా , నీరు ఇంకడానికి మట్టి లేకుండా , తారు మయం చేస్తే , ఈత నేర్చుకోమని చిన్న పిల్ల కాల్వను నడిరోడ్డుపై సృష్టించిన ఆకాష్ ను తిడతారు , కానీ చేసిన తప్పు లను ఒప్పుకోరు .

అప్పనంగా వచ్చిందని చెరువులు , కుంటలను ఆక్రమించి , ఆకాష్    ముంచేశాడు అంటే తప్పు ఎవరిది ? ఆకాష్ నీరు ఇవ్వక పోతే పంటలు ఉంటాయా  ? 

ఎంతో కష్టపడి  సముద్రం నుండి ఉప్పు ను వేరు చేసి , మంచి నీరు  తెచ్చి ఇస్తుంటే వాటిని ఒడిసి పట్టకుండా  , సముద్రం పాలు చేస్తారు  .ఒక సారి చేస్తే పొరపాటు , రెండో సారి చేస్తే తప్పు , మూడోసారి చేస్తే అలవాటు అవుతుంది . వాన లు వస్తొయని తెలిసీ ,నీరుని ఇంకించకుండా , కనీసం పోవడానికి దారి లేకుండా చేస్తే , వరదలు రావా . నాలాలు పొంగవా ? జనజీవనం అస్తవ్యస్తం అవదా ? ఇకనైనా కనులు తెరుస్తారా , ఆకాష్ మిత్రత్వం చూస్తారు , ఇలాగే ఉంటే ఆకాష్ కోపం రుచి చూస్తారు .    

Report

What do you think?

56 Points
Upvote Downvote

Comments

Leave a Reply

Loading…

Loading…

0

వేస్ట్ వాటర్

యోగవాసిష్ఠం