Menu
in ,

అమ్మ

అమ్మ-సృష్టిలో తియ్యని పదం, అమ్మ ని మించిన దైవం ఉన్నదా?-ఇలా చాలా పాటలు, పదాలు, కధలు మనకు తెలిసినవే.

కానీ నేను చెప్పబోయేది మ్యాక్సిమ్ గోర్కీ రచించిన నవల తెలుగు అనువాదం-“అమ్మ”.

మేడే అంటే మనకు ఒక హాలీడే. కాని కార్మికులకు అది ఎంత సుదినమో. చాలా మందికియు. ఎస్. ఎస్ .ఆర్ . అంటే తెలీదు. మా చిన్నప్పుడు రష్యా గురించి విన్నాం. మా కళ్ళ ముందే యునైటెడ్ సోషలిస్టు సోవియట్ రష్యా ముక్కలై, చిన్న దేశమైనది.

చరిత్రలో ఫ్రెంచి విప్లవం, రష్యా విప్లవం ఏదో చదివి, మర్చిపొతాము. కానీ బానిసత్వం, వెట్టిచాకిరి, శ్రామిక దోపిడీ -వీటిగురించి మనకు అంతగా తెలీవు. ఈ కధలో ఈ విషయాలు చదువుతుంటే మనసు ఆర్ద్రమవుతుంది.

ఎప్పడో 30 ఏళ్ళ క్రితం చదివాను. దాని గురించి రాద్దామని, ఒకసారి పుస్తకం తీస్తే ఏకబిగిన చదివాను. అంత చక్కగా శ్రామిక వర్గం కష్టాలు, దోపిడీ వివరించారు.

ఒక భార్య, తాగుబోతు భర్తతో పడే బాధ ఆనాటి కి, ఈనాటికి ఒకటే. విదేశమైనా, స్వదేశీ మైనా, గతంలో నైనా, ప్రస్తుతం అయినా ఒకటే. తన్నడం, తిట్టడం. భర్త చావు బతుకుల్లో ఉంటే, రక్షిం చాలని తపన. ఈ విషయం చక్కగా, సామాన్యంగా వర్ణించారు.

భర్త తర్వాత కొడుకు తాగుబోతుగా మారాలని చూస్తే, తల్లి గా బాధపడి, మార్గనిర్దేశం చేస్తుంది. తర్వాత కొడుకు విప్లవం లో చేరితే, భయపడినా, తర్వాత అతన్ని సమర్ధిస్తూ, చివరకు అతను విప్లవం లో పాల్లోలేనప్పుడు, తను ఆ విప్లవాన్ని కొనసాగించి, తుది శ్వాస వరకు పోరాడుతుంది.

క్షమాగుణం, ఓర్పు, త్యాగం, ధైర్యం, సాహసం కలబోసిన అమ్మ కధ ఆద్యంతం ఆసక్తికరంగా చదివిస్తుంది. ఆనాటి పరిస్థితులు మన కళ్ళముందు కనపడతాయి.

ఒకచక్కని, ఇన్స్పిరేషన్ కలిగిస్తుంది. మొదటి భాగం మాత్రమే చదివాను. వీలుంటే అందరూ చదువుతారని, చదివాక స్వేచ్ఛా స్వాతంత్ర్యంల విలువ అర్ధం చేసుకుంటారని అనుకుంటున్నా.

Leave a Reply

Exit mobile version