Menu
in ,

పదహారణాల పడుచుని పెళ్ళి చేసుకున్న డాక్టర్ ఏమయ్యాడు?

ఇది 1975 నాటి కేసు. స్వర్ణ కేసు అని చెపుతారు. ఒక డాక్టర్ పదహారణాల తెలుగమ్మాయి కావాలని , చదువు కున్న తోటి డాక్టర్ అమ్మాయి, ప్రపోజ్ ను తిరస్కరించాడు.

డాక్టర్ కోరిక మేరకు పల్లెపడుచుని చూసి తల్లి తండ్రులు పెళ్ళి చేశారు. పెళ్ళికి వచ్చిన క్లాస్ మేట్ డాక్టర్, పెళ్ళి కూతురు వేసుకున్న మందులు చూసి, డాక్టర్ ని హెచ్చరించింది.

హడివిడి తగ్గాక, డాక్టర్ మందులు విషయం నిలదీశాడు. వారు తప్పైందని, విడాకులు ఇప్పిస్తానని, గొడవ చేయవద్దని చెప్పారు. దానికి సమ్మతించి,ఆ రాత్రి వారింట్లో నే నిద్రపోయాడు డాక్టర్. అదే అతను చేసిన తప్పు.

తెల్లవారుజామున నదికి వెళ్ళి, ఏటి గట్టున చనిపోయాడు, అని తల్లితండ్రులకి కబురు పంపారు.వారు రాగానే, హడావిడి గా అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు.

శరీరం నీలంగా ఉండటం, బయటికి వెళితే గీత చిన్న పుస్తకం జేబులో పెట్టుకొనేవాడు, గీత గదిలో ఉండటం-అనుమానం వచ్చి, పోలీసు కంప్లైంట్ ఇచ్చారు.

పాయసం లో విషం కలిపి పెట్టారని తేలింది. ప్రాణం పొయాక, నది దగ్గరకు తీసుకొని వెళ్ళి ఏటి ఒడ్డున పడ వేశారు.

ఈ కేసు జిల్లా కోర్టులో, హైకోర్టు లో, సుప్రీంకోర్టు లో కూడా విచారణ జరిగింది. చివరకు లైఫ్ పడింది (14ఏళ్ళ కఠిన కారాగార శిక్ష). మొత్తానికి ఉరినుంచి తప్పించుకోవడానికి అప్పీలు చేసుకుంటూ 10ఏళ్ళు సాగదీశారు.

Leave a Reply

Exit mobile version