గణపతి ప్రధమ పూజ్యులు. విఘ్నహర్తుడు. గణనాయకుడు.
మరి ఆయన చరిత్ర లో సైన్స్ కి సంబంధించిన రెండు విషయాలు ఉన్నాయి.
మనందరికీ తెలుసు-గణపతి జన్మ, నలుగు పిండి కి రూపం ఇచ్చి, ప్రాణం పోయడం. దీని ఆధారంగా రోబోలను తయారు చేశారు.
వినాయక చవితి పండుగ రోజున గణపతి కి ఏనుగు తల అతికి ప్రాణం పోయడం వలన, మనమంతా పండుగను చేసుకుంటాము. కాని హెడ్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషను గురించి ఆలోచించం.
ఆధునిక టెక్నాలజీ తలకాయలు మార్చడానికి ప్రయోగాలు చేస్తుంటే, సనాతన భారతీయ ఋషులు దీన్ని అవలీలగా సాధించారు.
గణపతి కి ఏనుగు తల అతికి ప్రాణం పోశారు. దక్షునికి మేక తల అతికించారు. ఆనాడు అంతగా టెక్నాలజీ డెవలప్ అయ్యింది. కానీ నేడు ఇంకా దాన్ని సాధించలేదు.
మన ఋషులు సైన్స్ ను పండుగలతో మిళితం చేసి మన వారసత్వపు, శాస్ర్తీయ విద్యను గుప్తంగా, గుంభనంగా, రహస్యంగా మనకు అందించారు.
వేదాల్లో ఉన్న సైన్స్ అంతా భారతంలో ఉంటుంది. కాబట్టి భారతాన్ని పంచమ వేదం గా పరిగణిస్తారు.
వసిష్ఠుడు, గౌతముడు, కౌరవులు-కుంబోద్భవులు. మరి ఆ కుండ ను కృత్రిమ గర్భసంచిగా మార్చి ప్రయోగాలు చేసి , సాధిస్తున్నారు.
పురాణాలు కల్పితాలు, పుక్కిట పురాణాలు అని అంటారు, కానీ దానిలో సైన్స్ పై ప్రయోగాలు చేసి వాటిని విదేశీ రుణాలు తమ పేరు మీద సాధిం చారు.
సరోగసి నేటి ఆధునిక వైద్యం, కానీ బలరాముడు ఎలా పుట్టాడో భాగవతం చదివితే తెలుస్తుంది. ఆటంబాంబులు నేడు కనుక్కున్నారు, కానీ వారుణాస్ర్తం, పాశుపతాస్త్రం, బ్రహ్మాస్త్రం-వీటిని భారతీయ ఋషులు ఏనాడో వాడారు.
నలంద,తక్షశిల విశ్వవిద్యాలయాలు నాశనం చేసినా, ఆలయాల ను ధ్వంసం చేసి శిల్పకళా నైపుణ్యం మెరుగు పరిచినా, గ్రంథాలను తగలేసినా, భారతీయ ఋషులు సైన్స్ ను పండుగలతో మిళితం చేసి, మన వారసత్వపు శాస్ర్తీయ విద్యను గుప్తంగా, గుంభనంగా మనకు అందించారు.
- మహాభారతం లో ఉన్న సైన్స్ అంతా నేటికైనా బయటకు తీసి,పునః స్థాపించాలి.ఆ ఉద్దేశంతో నేను”” నాటి భారతం లో నేటి సైన్స్””శీర్షిక న కొన్ని వీడియో లు యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేశాను.
- గకార అష్టోత్తరం లింక్.
హెడ్ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ పై వీడియో లింక్.
గణపతి పూజ వెనుక సైన్స్ ను అందరికీ గుర్తు చేయాలని, మనం భారతీయులుగా జన్మించినందుకు గర్వపడుతూ, మన ఋషులకు అనంత కోటి వందనాలు తెలియ చేద్దాం.
Comments
Loading…
Loading…