ఏకరూప కవలలు ఉంటే సరదాగా ఉంటుంది. కవలల మీద చాలానే సినిమాలు వచ్చాయి. కానీ కవలపిల్లల చేతిలో మోసపోయిన సంఘటన ఒకటి ఉంది.
మా తాతగారి ఏడూరికి చుట్టాలు అందరూ వచ్చారు. కోంతమంది చదువుల కోసం దూరం గా ఉన్నవారు కూడా వచ్చారు.
అంతకుముందు మేము కలవని వారిని, మా కజిన్ పరిచయం చేశాడు. అందులో ఒక అతను అన్న అవుతాడని చెప్పాడు.
ఇంతలో మా అక్క వాచ్ లో బ్యాటరీ అయిపొయింది. మా కజిన్ కి ఇచ్చి, రిపేర్ చేయించమంది. అన్న గా పరిచయం చేసిన చుట్టం బజారుకు వెళుతున్నానని బయలు దేరాడు. మా కజిన్ వెంటనే అతనికి వాచ్ ఇచ్చి, రిపేర్ చేయించుకురా అన్నాడు. అతను సరే నని తీసుకొని , వెళ్ళి పోయాడు.
అరగంట తర్వాత అన్న వచ్చాడు. ముచ్చట్లు చెపుతున్నాడు. కానీ వాచీ మాట ఎత్తడు. చూసి, చూసి, ఇక లాభం లేదనుకుని, వాచీ ఏమయ్యింది -అని అడిగాము.
అతను ఏ వాచీ ? అని అమాయకంగా అడిగాడు.
దాంతో ఒళ్ళు మండిపోయింది. ఇందాక తీసుకెళ్ళి నది అనగానే, ఓ, అదా అమ్మేశాను -అన్నా డు.
మాకు ఒకటే టెన్షను. మా నాన్న కు తెలిస్తే ఏమోతుందోనని. ఇక గోలగోల చేశాం. మా వాచీ తెచ్చిమ్మని.
సరే, వెళ్ళి వాచీ తెస్తాను అని, బయటకు వెళ్ళాడు. 5 నిమిషాల్లో తిరిగి వచ్చి, వాచీ ఇచ్చాడు.
వాచీ చూసుకుని కుదుటపడి, వెళ్ళిన ఎడం లేదు, అప్పుడే ఎలా వచ్చావు? అయినా వాచీని ఎందుకు అమ్మావు? అని అడిగాము.
నేను వెళ్ళి, గంట అయింది. నేను వాచీ ని అమ్మలేదు-అన్నాడు. దాంతో ఆశ్చర్యపోయాం. మేము ఇంకా తేరుకోక ముందే ఇంకో అన్న వచ్చి, మొదటి అన్న పక్కన నిలబడ్డాడు. ఇద్దరూ సేమ్ టూ సేమ్ ఉన్నారు. వారిద్దరూ కవలలట. మేము అదే మొదటిసారి కవలపిల్లలను చూడటం.
తర్వాత వారు చేసే అల్లరి గురించి చెప్పి నవ్వించారు. ఒకే టికెట్ మీద సినిమాకు వెళ్తారని, హోటల్ కి వెళతారట. ఎవరైనా అడిగితే ఒకటే టికెట్ చూపిస్తారు. ఒకడే అనుకుంటారు. కానీ వీరు ఇద్దరూ, ఒకరి తర్వాత ఒకరు లోపలకు వెళుతూ, బయటకు వస్తూ, కన్ఫ్యూజ్ చేసి, ఎంజాయ్ చేస్తారట.
అక్క వరుస అమ్మాయి కవలలకు జన్మనిచ్చింది. వారు అచ్చు గుద్ది నట్లు ఒకలానే ఉంటారు. మా ఇంటికి వస్తే గుర్తు పట్టలేక,పెట్టిన పిల్లకే టిఫిన్ పెట్టి, ఇంకో పిల్లకు అసలు పెట్టే వారం కాదు.
దాంతో వారు, వారిద్దరికి గల చిన్న డిఫరెన్స్ చూపించి, దాని ఆధారంగా గుర్తు పట్టమన్నారు. మొత్తానికి వారున్నంత సేపు మస్తు తమాషాగా గడిచింది.
కవలల సినిమాలు చూస్తే, ఈ విషయాలు గుర్తు కొస్తాయి.
Comments
Loading…
Loading…