ఏడు తరాలు అనే ది “రూట్స్” అనే ఇంగ్లీషు నవలకు తెలుగు అనువాదం. ఎలెక్స్ హేలీ దీని రచయిత. ఈ పుస్తకం పులిట్జర్ బహు మతి పొందిన ది.
ఇంగ్లీష్ లో688పేజీల కధను తెలుగులో కుదించి 264పేజీలకు అనువాదం చేశారు. ఇది నాటి ఆఫ్రికా నుండి మనుషులను కిడ్నాప్ చేయడం, వారిని బానిసలుగా అమ్మడం, వారి కష్టాలను వర్ణిస్తుంది.
అలెక్స్ హేలీ 12 సంవత్సరాలు, తన మూలాలను, వంశస్తుల ను వెతుకుతూ ఆఫ్రికా లో చివరకు ఏడుతరాల కిందటి ముత్తాతకు తాత వంశస్తుల ను కలుసుకున్నాడు. ఈ ఏడు తరాలు పడిన కష్టాలు, వారి జీవన మే రూట్స్ కధ.
కింటాకుంటే బాల్యం లో హాయిగా కుటుంబం తో ఉంటాడు. అతని ఆటపాటలు, చదువు వర్ణనలు చక్కగా ఉంటాయి. కింటాకుంటే జీవితంలో బాల్యమే సంతోషంగా ఉంటుంది.
కొంత మంది కింటాకుంటేను కిడ్నాప్ చేసి పడవలో తీసుకుని వెళ్ళి,పెద్ద షిప్ లో కి ఎక్కిస్తారు. ఆ షిప్ లో చాలామంది ఆఫ్రికన్ యువకులు బందీలుగా ఉంటారు. వారిని దిగంబరులు గా చేసి,కుక్క లను కట్టినట్టు గొలుసు లతో కడతారు. తిండి ఒక పళ్ళెంలో పడేస్తే కుక్కల్లా తింటారు. మలమూత్రాలు అంతా వారి ఒంటికి అట్టకట్టి ఉంటాయి. వారానికి ఒకసారి బైటకు తీసి, శుభ్రం చేస్తారు.ఈ లో పల చాలామంది చనిపోతారు.
ఈ సముద్రయానం గురించి చదువుతుంటే కళ్ళు కన్నీటి సముద్రాలు అవుతాయి. కింటాకుంటే జీవితం లో అత్యంత భయానక, అసభ్యకర ప్రయాణం ఇదే. తర్వాత అతను బానిసగా అమ్ముడుపోవడం, నాలుగు సార్లు తప్పించుకోవడం, అతని కాలుకి గాయం చేయడం, ఇకపై తప్పించుకోవడం కుదరదని, బానిస జీవితం కు అలవాటు పడటం, ఆపైన వయసులో పెద్దదాన్ని వివాహం చేసుకోవడం, ఒక పిల్లకు జన్మనివ్వడం, ఆ బిడ్డ కు తన పూర్వీకుల గురించి చెప్పడం- ఇదీ అతని జీవితం .
అతని కూతురు పారిపోవాలని ప్రయత్నిస్తే, ఆమె ను వేరొకరి కి అమ్మడం, అతను, ఆమెను లైంగిక బానిస గా మార్చి, పిల్లలను కనడం, వారు పెద్దవటం. కొడుకు స్వాతంత్ర్యం పొంది, తల్లి కి విముక్తి కృషి చేయడం. ఈలోపు బానిసత్వం, వెట్టిచాకిరి రద్దు అవడం, తరాలు గడవడం,ఎలెక్స్ హేలీ తన మూలాలను వెతుకుతూ ఆఫ్రికా వెళ్ళి, కింటాకుంటే అన్నదమ్ముల వంశస్తులను కలవడంతో కధ ముగుస్తుంది.
కరుణ,దయ, జాలి, మానవత్వం, బానిస బతుకులు-అద్యంతం అద్భుతమైన వర్ణనతో,ఏడు తరాల జీవితాలు చదువరులను కట్టిపడేస్తుంది.
Comments
Loading…
Loading…