in ,

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్.

గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ గురించి చాలా మందికి తెలియదు. ఒకవేళ తెలిసినా దానిలో పేరు ఎక్కడం కష్టం అనుకుంటారు.

1985 -90ల మధ్య డీడీ ఛానల్ లో గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సీరియల్ గా వచ్చేది. దానిలో రికార్డు బద్దలు కొట్టాలంటే చాలా కష్టపడాలి అనుకునేవారు.

జీవితంలో ఎప్పుడైనా, ఎలాగైనా గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కి, పేరు మరియు సర్టిఫికెట్ సంపాదించాలని కోరిక ఉండేది.

కాని తీరడానికి ఏ విద్యా లో ను ప్రావీణ్యంలేదు. కాలం గడిచిపోతుంది. కోరికల ప్రాధాన్యం మారింది.పెళ్ళై, పిల్లలు పుట్టి, వారి చదువు- వీటిలో మునిగి తేలుతున్న ఆడవాళ్ళకి గిన్నిస్ బుక్ రికార్డు తీయని, తీరని కలగా మిగిలింది.

చాలా మంది అసలు దాని గురించి మరచిపోయారు. కాని ప్రకృతి లేదా దేవుడు మంచివారి న్యాయ మైన కోరికలు తప్పక తీరుస్తాడు.

సిలికానాంధ్ర అనే ఒక సంస్థ లక్షగళార్చన పేరుతో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చేస్తుంది. మొదట అన్నమయ్య కీర్తనలు-హైదరాబాదులో రికార్డు సాధించారు.

తర్వాత నాట్యం లో రికార్డు సాధించారు. కోవిడ్ 19 నుండి ప్రపంచాన్ని రక్షించడం కోసం హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణం లక్ష మంది తో చేయాలని సంకల్పించారు.

ప్రపంచ వ్యాప్తంగా, ఆన్ లైన్ లో జ్యూమ్ యాప్ ద్వారా ఆగష్టు 15, 2020, సాయంత్రం 8:30 నుంచి 11:00పి.ఎమ్(ఐఎస్ టి) భారత కాలమానం ప్రకారం 11సార్లు హనుమాన్ చాలీసా పారాయణము చేసి రికార్డు సాధించారు.

ఎందరో పెద్దలు, సామూహికంగా పారాయణము చేసి రికార్డు సాధించారు. తమ చిరకాల కోరికను తీర్చుకున్నారు. వ్యక్తిగతంగా సాధించలేనిది, సామూహిక పారాయణం తో సాధించారు.

టెక్నాలజీ ద్వారా లక్షలాది మంది భక్తులు ప్రపంచ వ్యాప్తంగా, మొదటి సారి ఈ రికార్డు సాధించారు.(ఈ వ్యాసకర్త కూడా రెండవ సారి పాల్గొన్నారు.) మళ్ళీ సిలికానాంధ్ర వారు ఏ విషయం లో రికార్డు చేస్తారో ఆశక్తి గా ఎదురు చూస్తున్నారు.

ఎవరికైనా రికార్డు సాధించాలని ఉంటే, సిలికానాంధ్ర సంస్థ నోటిఫికేషన్ కోసం వారి వెబ్ సైట్ ను వీక్షించండి.

Report

What do you think?

Comments

Leave a Reply

Loading…

Loading…

0

క్యాల్షియం ట్యాబ్లెట్ [Must Read]

గణపతి పూజ వెనుక సైన్స్